ప్రసవం అయిన మూడు రోజులకే వంశీప్రియ..  | Pregnant Lady Deceased With Corona In Jangaon District | Sakshi
Sakshi News home page

ప్రసవం అయిన మూడు రోజులకే వంశీప్రియ.. 

May 26 2021 4:31 AM | Updated on May 26 2021 5:16 AM

Pregnant Lady Deceased With Corona In Jangaon District - Sakshi

వంశీప్రియ (ఫైల్‌)

సాక్షి, జనగామ: కరోనా కాటుకు ఓ బాలింత బలైంది. ప్రసవం అయిన మూడు రోజులకే ఆమె మృత్యువాత పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జనగామకు చెందిన నిండు గర్భిణి వంశీప్రియకు నొప్పులు రావడంతో నాలుగు రోజుల క్రితం ప్రసూతి కోసం జనగామ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే, పాజిటివ్‌ ఉన్నందున హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.

అక్కడకు వెళ్లాక ప్రసవానికి సమయం ఉందంటూ ఇంటికి పంపించడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను భర్త స్వస్థలమైన హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల క్రితం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే.. పరిస్థితి విషమించి ఆమె మంగళవారం మృతి చెందింది. దీంతో మూడు రోజుల క్రితం పుట్టిన పసిగుడ్డుకు తల్లి లేకుండా పోయినట్లయింది. కాగా, అంతకుముందు వారం వ్యవధిలో వంశీప్రియ అమ్మమ్మ, మేనమామ కూడా మృతి చెందారు.   

చదవండి: (మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement