
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. డబ్బుల విషయమై సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. కాగా, కేటీఆర్ ఇటీవల రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, శ్రీనివాసరావు హన్మకొండలో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు ట్రాన్స్‌ఫర్ చేశారు. దీంతో, బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.