
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, కోస్తా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశంఉంటుందని చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38–40 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వెల్లడించింది. గురువారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.9 డిగ్రీ సెల్సియస్ నమోదైంది.