డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపండి | MLA Anirudh Reddy Counter to Manchu Vishnu Comments | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపండి

Apr 2 2026 8:37 AM | Updated on Apr 2 2026 9:04 AM

MLA Anirudh Reddy Counter to Manchu Vishnu Comments

జడ్చర్ల: డ్రగ్స్‌ పరీక్షలకు మేము సిద్ధమే..కానీ అవే పరీ­క్షలకు రాజకీయ నాయకులు సిద్ధమా? అంటూ సినీ నటుడు మంచు విష్ణు సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్య­లపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పందించారు. బుధ­వారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను ఓ ఎమ్మెల్యేగా డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపిస్తున్నానని, తన మాదిరిగానే సినీ నటులు కూడా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు.

 మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని ఆయన అప్పుడు ఏం పరీక్షలు చేయించుకున్నారని ప్రశ్నించారు. మీ సోదరుడు మనోజ్‌ టెస్టే మీరు చేయించలేరని తమపై ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ‘మేము ఏం టెస్టులు చేయించుకోవాలో రాసివ్వు ...ఆయా టెస్టులన్నీ చేయించుకుని రిపో­ర్టులు ముందుంచుతాము.. ఇందుకు మీరు కూడా సిద్ధమా?’అంటూ సవాల్‌ విసిరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement