తల్లిదండ్రులు లేని బాలికపై అఘాయిత్యం.. ఏడు నెలల గర్భం!

Minor Girl Got Pregnant In Nizamabad - Sakshi

సాక్షి, నవీపేట : ఓ బాలిక(16) ఏడు నెలల గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఎల్‌కె ఫారమ్‌ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన సదరు బాలికను అంగన్‌వాడీ టీచర్‌ అనుమానంతో పరీక్షించగా ఈ  విషయం బయటకు వచ్చింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక చదువుతోంది. ఆమె తల్లి గతంలోనే మృతి చెందింది. తండ్రి ఉపాధి కోసం మండలంలోని ఎల్‌కె ఫారమ్‌ గ్రామానికి వచ్చి  పాలేరుగా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కిందట తండ్రి దగ్గరకు వచ్చిన బాలిక ఇక్కడే ఉంటుంది.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సైతం మృతి చెందగా.. బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో బాలికను గమనించిన అంగన్‌వాడీ టీచర్‌ అనుమానం వచ్చి పరీక్షించగా ఏడు నెలల గర్భం దాల్చినట్లు తేలింది. ఎల్లారెడ్డిలో ఉండగానే ఈ ఘోరం జరిగినట్లు, కారకుడు ఎల్లారెడ్డి వాసిగా అనుమానిస్తున్నారు. సఖి కేంద్రం నిర్వాహకులు బాలికను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై యాకుబ్‌ను వివరణ కోరగా సంఘటన ఎల్లారెడ్డిలో జరిగిందని, తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top