‘ఎండాకాలం.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత’ | Minister Uttam Kumar Reddy On Power Generation Halted At Srisailam, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఎండాకాలం.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత’

Mar 29 2026 6:17 PM | Updated on Mar 29 2026 6:53 PM

 Minister Uttam Kumar Reddy  on Power Generation Halted at Srisailam

హైదరాబాద్‌: తెలంగాణ శాసన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎండాకాలంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతోందని చెప్పారు. 86 శాతం ప్రజలకు (3 కోట్ల 36 లక్షల మందికి) సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం కోటి 60 లక్షల జనాభాకు  రేషన్ కార్డులు ఇస్తుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, కమర్షల్ సిలిండర్ల కొరత ఉందని తెలిపారు. కొన్ని రోజుల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత కూడా తగ్గుతుందని చెప్పారు.

మరోవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్  స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ఫోకస్ పెట్టింది. దిండి ప్రాజెక్ట్ వచ్చే రెండేళ్లలో పూర్తి చేయబోతున్నామని హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వం చేసిన లోన్స్ వల్ల ఇప్పుడు సమస్య ఏర్పడింది. 97 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ఇరిగేషన్ పై ఖర్చు చేసింది.

 కాళేశ్వరం - పాలమూరు ప్రాజెక్ట్ పై మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పై ఒక్క ఎకరా కొత్త ఆయకట్టు రాలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలందరికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నాం. ఇరిగేషన్ శాఖలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రాజెక్ట్ ల భూ సేకరణ కోసం 5వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో పెట్టాం’ అని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement