
అమీర్‌పేట: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరో ముగ్గురిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌ఆర్‌నగర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న పద్మసాగర్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెం.201లో బ్యూటీ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అందులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నారనే సమాచారంతో ఆదివారం సోదాలు చేశారు.
ఆర్గనైజర్ శ్రీజ పారిపోగా స్పా సెంటర్‌లో ఉన్న సబ్ ఆర్గనైజర్ షేక్ పరీ్వన్ అలియాస్ నీలవేణి, మరో ఇద్దరు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. సబ్ ఆర్గనైజర్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పీలేరు నివాసి కాగా అమీర్‌పేట శ్యామ్‌లాల్ బిల్డింగ్‌లో నివాసం ఉంటోంది. సిద్దిపేట, బీదర్ జిల్లా కర్ణాకటకు చెందిన ఇద్దరు యువతులు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ చానల్ న్యూస్ రిపోర్టర్ మండలపు వెంకట రామాంజనేయులు విటుడిగా గుర్తించారు. వారి వద్ద నుండి 7 సెల్‌ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు, ఒక డీవీఆర్, స్వైపింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.