
సాక్షి, హైదరాబాద్: యాసంగికి సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్‌సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారం పౌరసరఫరాలభవన్‌లో కమిషనర్ అనిల్ కుమార్‌తో కలసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించా రు. యాసంగి సీజన్లో మొత్తంగా 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, సీఎంఆర్ కింద బియ్యంగా మార్చి 64 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుందని తెలిపారు.