కేటీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా... కారణాలు అవేనా?

KTRs Tour to Khammam Postponed - Sakshi

సాక్షి , ఖమ్మం: టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడింట్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ కామర్స్‌పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్‌ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్‌ టెక్‌ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖమ్మం పర్యటనకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో తదుపరి తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

అయితే, కేటీఆర్‌ ఖమ్మం పర్యటన వాయిదా వెనుక పై రెండు కారణాలే ఉన్నాయా? లేక బీజేపీ మజ్దూర్‌ సంఘ్‌ జిల్లా కన్వీనర్‌ సాయిగణేష్‌ మృతితో తలెత్తిన పరిస్థితులు కారణమా? అనేది తెలియదు. సాయిగణేష్‌ మృతితో బీజేపీ శ్రేణులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను కొన్నిచోట్ల బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పోటాపోటీ నినాదాలతో ఖమ్మం పట్టణం అట్టుడికింది. ఈనెల 18న మంత్రి కేటీఆర్‌ ఖమ్మంలో పర్యటించాల్సి ఉంది.  తొలుత ఈనెల 16న కేటీఆర్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. పలు కారణాలతో 18వ తేదీకి వాయిదా పడింది.

చదవండి: (20 రోజుల్లో పెళ్లి.. ఇప్పటికే 16 కేసులు..  చార్జిషీట్‌ కూడా తెరవడంతో)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top