
రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడడానికి అర్హత సాధించారు.
పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తి. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.
ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం సోషల్ మీడియా ద్వారా తెల్సుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్.. తనకు భరోసా ఇచ్చి క్రీడా పరికరాలు, ఆర్ధిక సహాయం చేసి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని అంటున్నారు పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ‘రామన్న అంటేనే ఒక భరోసా.. సామాన్యులకు కొండంత అండ’ అని బీఆర్‌ఎస్ పేర్కొంది.
రామన్న భరోసా ❤️
అన్నా అంటే చాలు..
నేనున్నానంటూ భుజం తట్టి ప్రోత్సాహిస్తాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ… https://t.co/Vjzaimft7r pic.twitter.com/mrI21wBFNe— BRS Party (@BRSparty) October 19, 2025