
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న కొత్త రాజకీయ పరిణామాలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలోని విభేదాలే కారణమని ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ న్యూస్ చానల్‌లో చేస్తున్న ప్రచారాన్ని కొండా రాఘవరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్న తమ నాయకురాలు వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న ఆలోచనలకు కుటుంబ విభేదాలను అంటగట్టడం రాష్ట్ర ప్రజలను, వైఎస్సార్ అభిమానులను కించపరచడమే అవుతుందన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల తీసుకోబోతున్న నిర్ణయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు, వారి కుటుంబ దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.