
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై కేంద్ర మత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మణిపూర్లో జరుగుతున్నఆందోళన దురదృష్టకరమన్నారు. కొన్ని కులాల మధ్య ఘర్షణ జరుగుతోందని.. అయితే ఇప్పటికే చర్చలు ప్రారంభించామని తెలిపారు. మణిపూర్‌లో కర్ఫ్యూ సడలించామని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అల్లర్లపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే సాధారణ పరిస్థితి ఏర్పాడుతుందన్నారు.
హింస ద్వారా ఏమి సాధించలేమని, కేంద్ర ప్రభుత్వం సామరస్యంగా చర్చలకు సిద్దంగా ఉందని తెలిపారు. రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నామని పేర్కొన్నారు. డిమాండ్స్‌పై చర్చలకు రావాలని సూచించినట్లు చెప్పారు. హింస ద్వారా ప్రజలకు నష్టం జరుగుతోందని.. శాంతి నెలకొల్పడానికి అన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు.
చదవండి: మహారాష్ట్రపై కేసీఆర్ నజర్.. బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు!