
ఇటీవల బాగా పెరిగినఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు
అత్యాశకు పోయి కేటుగాళ్లకురూ. కోట్లు సమర్పయామి
ఏడాదిలో ఇప్పటికే 17,169 కేసులు.. రూ.639.94 కోట్లు పోగొట్టుకున్నబాధితులు
హైదరాబాద్‌కు చెందిన ఒకరు వాట్సాప్ ద్వారా ‘బజాజ్ ఫైనాన్షియల్‌సెక్యూరిటీస్ లిమిటెడ్’అనే పేరుతో ఉన్న నకిలీ గ్రూప్‌లో చేరాడు. ఈ గ్రూప్ మార్కెట్ ట్రెండ్స్, బ్లాక్ ట్రేడ్స్, ఐపీఓలపై అప్‌డేట్స్ ఇచ్చేది. గ్రూప్ అడ్మిన్ పురవ్ ఝవేరి, అతని సహాయకురాలు ప్రిషాసింగ్ బాధితుడిని ఒక నకిలీ యాప్‌లో ఇన్వెస్ట్ చేయమని ప్రోత్సహించారు. దీంతో బాధితుడు మే 30 నుంచి జూలై 9, 2025 మధ్య రూ.3.24 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు విత్‌డ్రాకు వీలుకాకపోవడంతో టీజీసీఎస్‌బీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో టీజీసీఎస్‌బీకి అధికారులు మహ్మద్ రజియుద్దీన్, మహ్మద్ వలియుల్లా, మహ్మద్ జుబైర్‌ఖాన్‌లను అరెస్టు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరగా, ఒక మహిళ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి సలహాలు ఇవ్వగా, ఒక నకిలీ వెబ్‌సైట్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు రూ.3.30 కోట్లు అందులో పెట్టాడు. విత్‌డ్రా చేయడానికి ప్రయతి్నంచగా, 10 శాతం కమీషన్, ట్యాక్స్ చెల్లించమని కోరడంతో ఇది స్కామ్ అని గుర్తించి టీజీసీఎస్‌బీకి ఫిర్యాదు చేశాడు.
తాజాగా ఆదివారం (సెప్టెంబర్ 7) నమోదైన కేసులో యూసుఫ్‌గూడకు చెందిన వ్యక్తి రూ.28.76 లక్షలు ఈ తరహా మోసంలో పోగొట్టుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సలహాలతో ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. ట్రేడింగ్ ఐపీఓల పేరిట పెట్టుబడి పెట్టేలా చేశారు. మొదట లాభాలు వచి్చనట్టు చూపి తర్వాత డబ్బులు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వలేదు.
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశే కొందరి కొంప ముంచుతోంది. ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. పెట్టిన పెట్టుబడికి పదుల రెట్లలో లాభాలు వస్తాయని ఆశపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణానికి భిన్నంగా తక్కు వ సమయంలోనే అనూహ్య లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే అవి పక్కా మోసమే అన్న చిన్న లాజిక్ మిస్సవుతున్న ఎంతోమంది సైబర్ నేరగాళ్లకు రూ.కోట్లు సమర్పించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు పెరిగినట్టు టీజీ సైబ ర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ ఏడాది లో ఆగస్టు 31 వరకు చూస్తే ఈ తరహా కేసులు 17,169 నమోదైనట్టు టీజీసీఎస్‌బీ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా మోసం చేస్తున్నారు...
సైబర్ కేటుగాళ్లు అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లు వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వేదికల్లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, తద్వారా భారీ లాభాలు పొందే అవకాశాల గురించి మెసేజ్‌లు పంపుతారు. అందులో లింక్‌లపై ఎవరైనా క్లిక్ చేస్తే వారికి ఆన్‌లైన్ పెట్టుబడుల అంశాలపై సలహాలు ఇస్తూ...నమ్మకం పెంచుతారు.
ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ కల్పిస్తారు. అవతలి వ్యక్తి తమను నమ్ముతున్నట్టు గుర్తిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్‌లలో యాడ్ చేయడం..తాము సూచించిన యాప్‌లలో పెట్టుబడి పెట్టాలని క్రమంగా ఒత్తి్తడి చేస్తారు. తొలుత లాభాలు వచ్చినట్టుగా నకిలీ మెసేజ్‌లు చూపుతారు. ఇలా రూ.లక్షల నుంచి మొదలై రూ.కోట్ల వరకు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
» తక్కువ సమయంలో అధిక లాభాలు అంటూఊదరగొడుతున్నారంటే అది మోసమని గ్రహించాలి.
» వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే ఎస్‌ఎంఎస్‌లలో ఉండే లింక్‌లపైక్లిక్ చేసి వారిచ్చిన యాప్‌లలో పెట్టుబడి పెట్టొద్దు.
» మీరు పెట్టుబడి పెట్టే ముందు చట్టబద్ధత ఉందా లేదానిర్ధారించుకోవాలి. షేర్లలో పెట్టుబడి డీమాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుందని మరవొద్దు.
అధిక లాభాల ప్రకటనలతోజాగ్రత్తగా ఉండండి
సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి టిప్స్,లింక్‌లను నమ్మి తెలియని యాప్‌లు లేదావెబ్‌సైట్‌లలో పెట్టుబడి పెట్టి మోసపోవొద్దు. అధిక లాభాల ప్రకటనలతో జాగ్రత్తగా ఉండండి.మీ డబ్బులు సురక్షితంగా ఉంచుకోండి – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్‌బీ