పీపుల్స్‌ ప్లాజా వేదికగా ‘రాల్‌–ఇ’

Indias Largest EV Rally Flagged Off in Hyderabad - Sakshi

ప్రారంభమైన ఎలక్ట్రిక్‌ వాహనాల ర్యాలీ 

ఈవీలకు ప్రోత్సాహం: జయేశ్‌ రంజన్‌

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్‌ ర్యాలీ ‘రాల్‌–ఇ’ నగరంలోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా ఘనంగా ప్రారంభమైంది. వారం పాటు జరిగే ఈ ర్యాలీ ఆదివారం 400 వందలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)­లతో ప్రారంభమైంది. ఈ కార్యక్ర­మాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. అనంతరం జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్‌ వాహ నాల వైపు మొగ్గుచూపాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలుదారులకు రాయి­తీలను ఇస్తుందన్నారు.

ఈవీల ప్రాము­ఖ్యతను తెలియజేసేందుకు మొదటి­సారిగా ఇ–మొబిలిటీ వీక్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా పీపుల్స్‌ ప్లాజా, మియాపూర్, శంషాబాద్, ముంబై హైవే నుంచి అందరూ ఎలక్ట్రిక్‌ వాహనాలతో రాల్‌–ఇ ర్యాలీతో హైటెక్స్‌ వరకు చేరుకుంటారన్నారు. సౌకర్యవంతంగా ఉండటంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను కొను గోలు చేయాలని సూచించారు.

నగరంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కూడా జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అడివి శేషు మాట్లాడుతూ.. యువత ఈవీల వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఈ సందర్భంగా గ్రావ్‌టన్‌ మోటార్స్‌కు చెందిన షెరాజ్, రాహుల్‌లు ఎలక్ట్రిక్‌ వాహనాలతో చేసిన స్టంట్స్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి. ర్యాలీలో దర్శకుడు నాగ్‌ అశ్విన్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top