Amnesia Pub Case: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసుల సంచలన నిర్ణయం

Hyderabad Police Sensational Decision in Jubileehills Molestation Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసు నిందితులను ట్రయల్‌ సమయంలో మేజర్‌లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డును కోరారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత ట్రయల్‌ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు హైదరాబాద్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు పోలీసుల వినతిపై జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నిటిని పరిగణలోకి తీసుకొని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు నిర్ణయం వెల్లడించనుంది. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్‌ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు. 

చదవండి: (Amnesia Pub Case: జువైనల్‌ హోమ్‌కు ఎమ్మెల్యే కుమారుడు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top