నుమాయిష్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ ఏడాది పూర్తిగా రద్దు..

Hyderabad Numaish Totally Suspended In 2022, Due To Covid Cases Spike - Sakshi

సాకక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా నమోదవుతుంటంతో నాంపల్లి నుమాయిష్‌పై ఎగ్జిబిషన్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుమాయిష్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. జనవరి ఒకటినా తెలంగాణ గవర్నర్‌ చేతుల మీదుగా నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదలైన రెండు రోజులకే కరోనా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు నుమాయిష్‌ మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. తాజాగా కరోనా, ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతుండటంతో ఈ ఏడాది నుమాయిష్‌ పూర్తిగా నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. 
చదవండి: ఆ వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాగా ప్రతి ఏడాది జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు సాగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను అమ్ముతుంటారు. ఇక నుమాయిష్‌కు ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు. ఈక్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కట్టడి సాధ్యం కాదని భావించిన అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తిగా దీనిని రద్దు చేసింది. అయితే  2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే.
చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top