మానవత్వం చాటుకున్న మహిళ కానిస్టేబుల్‌..

Humanity Of Lady Constable In Warangal - Sakshi

సాక్షి, పరకాల(వరంగల్‌): మానసిక స్థితి సరిగాలేని, చినిగిన దుస్తులతో తిరుగుతున్న ఓ మహిళ పట్ల పరకాల పోలీస్‌స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ ఔదార్యం చూపారు. శనివారం పైడిపల్లి రోడ్డులో పెట్రోలింగ్‌ చేస్తుండగా కానిస్టేబుల్‌ సోనికి మానసిక స్థితి సరిగాలేకుండా, చిరిగిన దుస్తులతో తిరుగుతున్న మహిళ కనిపించింది.

దీంతో చలించిపోయిన సోని షాపులో నైటీ కొనుగోలు చేసి సదరు మహిళకు ధరింపజేశారు. అంతేకాకుండా హోటల్‌లో టిఫిన్‌ తీసుకొచ్చి పెట్టారు. ప్రెండ్లీ పోలీసింగ్‌ అని సోని నిరూపించారని స్థానికులు ప్రశంసించారు. 

ఆటో నుంచి కిందపడి డ్రైవర్‌ మృతి
గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌ 15వ డివిజన్‌ మొగిలిచర్లకు చెందిన పుచ్చ శ్రీనివాస్‌(43) అనే ఆటో డ్రైవర్‌ ఆటో నుంచి దిగబోయి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి భార్య కథనం ప్రకారం.. పుచ్చ శ్రీనివాస్‌ తన ఆటోలో కూతురును ఎంసెట్‌ పరీక్ష రాయించడానికి తీసుకెళ్లాడు.

తిరిగి ఇంటికి వచ్చాక ఆటో దిగుతుండగా కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. తన కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడని, అతడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని భార్య రజిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై దేవేందర్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top