తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్‌ పెంపు | Huge Stipend Hike For Medicos In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్‌ పెంపు

Jun 29 2025 6:32 PM | Updated on Jun 29 2025 6:45 PM

Huge Stipend Hike For Medicos In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్ పెరిగింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని సైతం ప్రభుత్వం పెంచింది.

ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌‌లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది.

సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌‌లో రూ.1,11,785, థర్డ్‌ ఇయర్‌‌లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement