Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోత

Published Tue, Jul 25 2023 3:44 AM

Heavy Rains and Floods in Hyderabad City  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను సోమవారం సాయంత్రం జడివాన వణికించింది. గంటపాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రాత్రి వరకు ఓ మోస్తరు వాన కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా శివరాంపల్లిలో 6.2, చార్మి నార్‌లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో నాలుగైదు సెంటీమీటర్ల వరకు పడింది. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది.

నాలాలు, మ్యాన్‌హోల్‌లు పొంగి పొర్లాయి. దీంతో నగరమంతా ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. వాహనదారులు గంటల కొద్దీ అవస్థ పడ్డారు. అబిడ్స్‌ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు ఎగిరిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. లంగర్‌హౌజ్‌ ప్రాంతంలో ఒక మసీదుపై పిడుగు పడటంతో గోడలకు పగుళ్లు వచ్చాయి. పైన ఉన్న గుమ్మం కింద పడిపోయింది. వర్షంతో అప్రమత్త మైన అధికార యంత్రాంగం.. ప్రజలెవరూ అవస రమైతే తప్ప బయటికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. 

నేడూ భారీ వర్షాలు..
అతిభారీ వర్షాలు: మహబూబాబాద్, వరంగల్,హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ అధికంగా భారీ వర్షాలు, ములుగు, భద్రాద్రికొత్తగూడెం,నల్లగొండ,ఖమ్మం,సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీవర్షాలు కురవచ్చు. 

మోస్తరు నుంచి భారీ వర్షాలు:జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి,హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవచ్చు. 

Advertisement

What’s your opinion

Advertisement