
హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల తర్వాత ఈ నెల కోటా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం లబ్ధిదారుకు బియ్యంతోపాటు సంచి ఇవ్వాలని నిర్ణయించింది. సరిపడా సంచులు జిల్లాకు సరఫరా చేసింది. అయితే సన్నబియ్యం పంపిణీ ప్రారంభమై ఐదురోజులైనా ఎక్కడా సంచులు పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు ఇంటి నుంచి తెచ్చుకు న్న సంచుల్లోనే బియ్యం తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల సంచి కోసం డీలర్లను ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీని సంప్రదించగా సంచుల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు.