మంత్రాల నెపంతో దంపతులపై దాడి | Family Members Beat Up Couple Accuse Them Of Practicing Black Magic In Medak | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో దంపతులపై దాడి

Feb 15 2022 1:36 AM | Updated on Feb 15 2022 2:59 PM

Family Members Beat Up Couple Accuse Them Of Practicing Black Magic In Medak - Sakshi

దంపతులను స్తంభానికి కట్టేసిన దృశ్యం

అల్లాదుర్గం(మెదక్‌): మంత్రాలు(చేతబడి) చేస్తున్నారనే నెపంతో దంపతులను  కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పాలివారైన రమేశ్‌ కుటుంబం చేతబడే... కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు ఆదివారంరాత్రి గొడవపడ్డారు.

సోమవారం ఉదయం మళ్లీ గొడవకు దిగి రమేశ్‌ను, ఆయన భార్య రజితను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై స్తంభానికి వైర్లతో కట్టేశారు.   కట్టెలతో కొట్టారు.  పోలీసులు వచ్చి రమేశ్‌ దంపతులను ఆసుపత్రికి తరలించారు. రమేశ్‌ ఫిర్యాదు మేరకు కిష్టయ్య కొడుకులు కుమార్, నగేశ్, భేతయ్య, భార్య ఆశమ్మ, కూతురు అంబమ్మపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement