కోతులకూ కుటుంబ నియంత్రణ!

Family control also for monkeys - Sakshi

సంరక్షణ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోనే తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగాపూర్‌ మండలం చించోలి (బి)వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం మొదటిది కాగా, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం గమనార్హం. రూ.2.25 కోట్ల అటవీ శాఖ నిధులతో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  

ఇక్కడ ఏం చేస్తారు? 
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు అక్కడ తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు. ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆపరేషన్‌ థియేటర్, డాక్టర్స్‌ రెస్ట్‌ రూమ్స్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. అలాగే సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. 2017లో దీని నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top