సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'దివ్యాంగులు, వృద్ధులు ,ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ' (EPwD), ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ శిక్షణా కార్యక్రమాలలో డ్రోన్ పైలట్ శిక్షణ, హోటల్ నిర్వహణ విభాగం కింద క్యాంటీన్ చెఫ్ శిక్షణ , కారు డ్రైవింగ్ నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు (04.04.2026) ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న NITHM ప్రాంగణంలో జరగనుంది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల గౌరవ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


