ఆంగ్ల మాధ్యమంలో పాఠాలేవీ?

Department of Education That Does Not Care About English Medium Students - Sakshi

ప్రభుత్వ బడుల్లోని 10 లక్షల మంది ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులను పట్టించుకోని విద్యాశాఖ

తెలుగు మీడియం విద్యార్థులకే 900 డిజిటల్‌ పాఠాలు సిద్ధం చేసిన వైనం

దీనిపై నోరువిప్పని అధికారులు.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 10 లక్షల మంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు వీడియో పాఠాలు లేకుండా పోయాయి. తెలుగు మీడియం విద్యార్థులకు మంగళవారం నుంచి డిజిటల్‌ పాఠాలను (వీడియో పాఠాలు) దూరదర్శన్, టీశాట్‌ ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టిన విద్యాశాఖ ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులను మాత్రం పట్టించుకోలేదు. 

కిం కర్తవ్యం...?: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,87,563 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో తెలుగు మీడియం విద్యార్థులు 15,44,208 మంది (57.46 శాతం), ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు 10,16,334 మం ది, మరో లక్ష మంది వరకు ఇతర మీడియం విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి మూతబడిన స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకొనే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రత్యామ్నాయ అకడమిక్‌ కేలండర్‌ అమలుకు కార్యా చరణ రూపొందించింది. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర విద్యా సాంకేతిక మండలి (ఎస్‌ఐఈటీ) రూపొందించిన వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఎస్‌ఐఈటీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు మీడియం విద్యార్థుల కోసమే 900 వరకు వీడియో పాఠాలను రూపొందించింది. ఆంగ్ల, ఇతర మీడియంల విద్యార్థులకు వీడి యో పాఠాలను రూపొందించలేదు. గతంలో ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థుల కోసం 65 వీడి యో పాఠాలను రూపొందించి ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని 10 లక్షల మంది వరకు ఉన్న ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ది అర్థంకాని ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులెవరూ నోరు విప్పట్లేదు. 

ప్రైవేటు విద్యార్థులకూ కష్టమే..: ప్రస్తుతం రాష్ట్రంలోని 10 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పా ఠశాలల్లో 31,22,927 మంది విద్యార్థులు చ దువుతున్నారు. వారిలో ఇంగ్లిష్‌ మీడియం వి ద్యార్థులే 30,27,459 మంది ఉన్నారు. వారి లో ఆన్‌లైన్‌ బోధన అందుతున్నది దాదాపు 10 లక్షల మందికే. కార్పొరేట్, కొంత పేరున్న 2,500 పాఠశాలలు మాత్రమే ఆన్‌లైన్‌ తరగ తులను నిర్వహిస్తున్నాయి. మిగతా 7,500 పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ పా ఠాలకు సాంకేతిక ఏర్పాట్లు చేసుకోలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top