అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Speech In Teachers Day Celebration | Sakshi
Sakshi News home page

అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్‌

Sep 5 2025 2:37 PM | Updated on Sep 5 2025 4:16 PM

Cm Revanth Reddy Speech In Teachers Day Celebration

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖ ముఖ్యమైందని.. అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. శుక్రవారం ఆయన శిల్పకళా వేదికలో టీచర్స్‌ డే వేడుకల్లో మాట్లాడుతూ.. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని.. మేం వచ్చాక ఉపాధ్యాయులు నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు జరిగిందా? అంటూ ప్రశ్నించిన రేవంత్‌.. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. ఉస్మానియా వర్శిటీని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే. ఫుడ్‌ పాయిజన్‌ వార్తలు చూస్తే బాధేస్తుంది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి’’ అని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ శుభవార్త

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement