తెలంగాణకు తగ్గట్టుగా ఉండాలి

CM KCR Mandates To Agriculture Officers For New Horticulture Policy As Per Telangana BackGround - Sakshi

ఉద్యాన విధానంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం

వ్యవసాయ రంగాన్ని  బలోపేతం చేసేలా పాలసీని రూపొందించాలి

ఉద్యాన పంటల సాగు విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాలి

హార్టికల్చర్‌ అభివృద్ధికి ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’ ఏర్పాటు

వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో 300 ఎకరాలు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అను సరించి ఉద్యాన (హార్టి్టకల్చర్‌) విధానాన్ని రూపొం దించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు మరింత విస్తరి ంచే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. హార్టి కల్చర్‌ యూనివర్సిటీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణలో హార్టి్ట కల్చర్‌ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధ తుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందు కోసం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యా లయం ప్రాంగణంలో 300 ఎకరాలను కేటాయిస్తు న్నట్టు ప్రకటించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ‘ఉద్యాన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణా ళిక’ అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, హార్టి్టకల్చర్‌ వర్సిటీ వీసీ నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో మూస పద్ధతిలో...
‘‘ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూస పద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీళ్లతో సాగైన వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. తద్వారా సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో వ్యవసాయం బాగా వెనకబడిపోయింది. వ్యవసాయ రంగానికి ఓ విధానం రూపొందించక పోవడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లాంటి ఉద్యాన పంటల సాగు చాలావరకు విస్మరించబడింది. 
సర్కార్‌ చర్యలతో గాడినపడిన వ్యవసాయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణం,  రైతుబంధు వంటి వ్యవసాయ ప్రోత్సాహక చర్యలతో తెలంగాణ వ్యవసాయం గాడిలో పడింది. దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా ముందుకు సాగుతున్నది. రైతన్నల జీవితాలు గుణాత్మక అభివృద్ది దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించుకోవాలి.

మనది అత్యంత అనుకూల ప్రాంతం
మన నేలలు, పంటల స్వభావం మనకు అర్థమవు తోంది. తెలంగాణ నేల అద్భుతమైన సాగు స్వభా వాన్ని కలిగి ఉంది. ఇక్కడ కురిసే వర్షాలు, గాలి, వాతావరణం హార్టీకల్చర్‌ పంటలకు అత్యంత అనుకూలమైనవి. అందువల్ల ఉద్యాన పంటలను తెలంగాణలో అద్భుతంగా పండించవచ్చు. సాగునీటి ప్రాజెక్టుల వలన నీరు పుష్కలంగా లభిస్తున్న నేపథ్యంలో తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేందుకు మన రైతాంగాన్ని ఉద్యాన పంటల సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరముంది. ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకుని, ఉద్యాన నర్సరీలను నెలకొల్పే రైతులకు, పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు.. రైతుబంధుతో పాటుగా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు కార్యాచరణ రూపొందించాలి. పండ్లు, కూరగాయలు, పూల సాగులో ఉద్యానవన శాఖ ఇప్పుడెలా వుంది? భవిష్యత్తులో ఎలా ఉండాలో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.

దిగుమతి స్థాయి నుంచి ఎగుమతికి పెరగాలి
తెలంగాణలో మొత్తం 129 మున్సిపాలిటీలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్‌ నగరాలు, పట్టణాలున్నాయి. వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసరాలను అందించేందుకు ఆ పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపిక చేసి, కూరగాయలు తదితర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా తెలంగాణలోని పట్టణ ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి  ఉండదు. అదే సమయంలో ఎగుమతి చేసే దిశగా ఉద్యానవన శాఖ చర్యలు చేపట్టాలి. అంతర్గతంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకునే వీలుంది.

ఉద్యాన శాఖకు నలుగురు ఉన్నతాధికారులు
ఉద్యానవన శాఖలో పని విధానాన్ని వికేంద్రీకరించుకోవాలి. పని విభజన జరగాలి. ఇప్పుడు ఉద్యానవన శాఖకు ఒకే కమిషనర్‌ ఉన్నారు. ఇక నుంచి పండ్ల తోటల సాగుకోసం, కూరగాయలు.. ఆకుకూరల సాగు కోసం, పామాయిల్‌ సాగు కోసం.. మొత్తంగా నలుగురు ఉన్నతాధికారులను నియమించాలి. 

సాగు ఖర్చు తగ్గించాలి
రైతులకు పంటల సాగులో విపరీతమైన ఖర్చు పెరిగిపోతోంది, సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకుని సాగువిధానాలను రూపొందించుకుని రైతు సాగు ఖర్చు తగ్గించుకునే దిశగా వ్యవసాయ శాఖ విధివిధానాలు రూపొందించుకోవాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పనిచేస్తున్నారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేసి, రైతుల సెల్‌ ఫోన్లకు కూడా మెసేజీలు పంపిస్తున్నారు. ఈ విధానం దేశంలో మరెక్కడా లేదు. కేంద్రం అమలు చేస్తున్న నూతన సాగు చట్టాలతో సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందాం..’’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 

ముఖ్య కేంద్రాల్లో సమీకృత కూరగాయల మార్కెట్లు
వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే స్ఫూర్తితో సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల సెంటర్లలో గజ్వేల్‌ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top