యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్

Chief Secretary Somesh Kumar Teleconference With Collectors Over Paddy Procure - Sakshi

జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌

తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌న్‌ నిర్వహించారు. జిల్లాల వారీగా యాసంగిలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలపై చర్చించారు.  
కొనుగోలు కేంద్రాలు తగ్గించొద్దు: ‘సీఎం సూచనల మేరకు ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పా టు చేయాలి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలి. సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలి. కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నివేదిక రూపొందించుకోవాలి..’అని సీఎస్‌ సూచించారు. 

రోజుకు నాలుగైదు కేంద్రాల తనిఖీ: ‘జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. గత సంవత్సరం యాసంగి సీజన్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సంఖ్యకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమించి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా గన్ని బ్యాగుల సేకరణపై దష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి తగు పర్యవేక్షణ జరపాలి. రైతుకు కనీస మద్దతు ధర రూ.1,960 లభిం చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి..’అని ఆదేశించారు.  

ఏరోజుకారోజు నివేదికలు:‘కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని వెం టనే రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం సేకరణపై ఏరోజు కారోజు నివేదికలు పంపించాలి. జిల్లాల్లో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి. అందు కోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలి..’అని సీఎస్‌ చెప్పారు.  

హైదరాబాద్, కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు 
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయా లని సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో కూడా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, పంచా యి తీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తాని యా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top