తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌ | Telangana Assembly Speaker Suspends BRS MLAs Over Budget Disruption, Ethics Committee To Examine Kaushik Reddy Incident | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌

Mar 29 2026 1:40 PM | Updated on Mar 29 2026 5:22 PM

Brs Members Suspended From Telangana Assembly

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెన్షన్‌ చేశారు. కేటీఆర్‌,హరీష్‌రావు, కృష్ణారావు, మహిపాల్‌రెడ్డి పద్మారావు, చింతా ప్రభాకర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్‌ చర్యలు చేపట్టారు.

ఎథిక్స్‌ కమిటీకి పాడి కౌశిక్‌ వ్యవహారం..
తెలంగాణ అసెంబ్లీని కౌశిక్‌రెడ్డి వ్యవహారం కుదిపేసింది. సభలో కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై  ఎథిక్స్‌ కమిటీకి స్పీకర్‌ సిఫారసు చేశారు. కౌశిక్‌ వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ సమర్థిస్తుందా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సీనియర్‌ ఎమ్మెల్యే పట్ల కౌశిక్‌ ప్రవర్తన సరికాదని.. ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కడియం శ్రీహరి నిబద్ధత, నిజాయితీ ని ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించలేరు. కడియం శ్రీహరి అవినీతి మచ్చలేని నేత. కడియం శ్రీహరి విషయంలో మీ సభ్యులు వ్యవహరించిన తీరును కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తున్నారా?. కడియం శ్రీహరికి జరిగినట్లే రేపు కేసీఆర్‌కు జరిగితే సమర్థిస్తారా?. సభకు కుస్తీల పోటీకి రాలేదు. సభలో కూర్చింటే బిఆర్ఎస్ సభ్యులను కొనసాగించండి. లేదంటే ఈ రెండు రోజులు సస్పెండ్ చేయండి. కౌశిక్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని స్పీకర్‌ను రేవంత్‌రెడ్డి కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement