పనిలోంచి తొలగించారని సిలిండర్‌ ఎత్తుకెళ్లారు | Rangareddy Couple Steals Employer Bike, Gas Stove And Cylinder After Being Fired, More Details Inside | Sakshi
Sakshi News home page

పనిలోంచి తొలగించారని సిలిండర్‌ ఎత్తుకెళ్లారు

Mar 29 2026 11:50 AM | Updated on Mar 29 2026 12:59 PM

Gas Cylinder Incident Ghatkesar Police Station

రంగారెడ్డి జిల్లా: యజమాని తమను పనిలోంచి తొలగించాడని అతడి బైక్, గ్యాస్‌ స్టౌతో పాటు సిలిండర్‌ను ఎత్తుకెళ్లిన దంపతుల ఘటన ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన మల్లెల కిరణ్, ఆయన భార్య ఉపాధి కోసం «అంకుషాపూర్‌ వచ్చాకె. గ్రామానికి చెందిన పెరికాల ప్రవీణ్‌ తన ఫాంహౌద్ద ఈ దంపతులను నెల క్రితం పనిలో పెట్టుకున్నారు. వీరికి రూ. 25 వేలు అడ్వాన్స్‌ ఇచ్చారు. కాగా.. పని సక్రమంగా చేయడం లేదని విధులకు రావొద్దని వారికి సూచించారు. దీంతో యజమానిపై కోపంతో అతడి బైక్, స్టౌతో పాటు సిలిండర్‌ను ఈ నెల 16న ఎత్తుకెళ్లిపోయారు. ఫోన్‌ చేస్తే త్వరలో వస్తామని చెప్పినా.. వారం రోజులుగా స్పందించకపోవడంతో ప్రవీణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.   

Advertisement
 
Advertisement
Advertisement