
కేంద్ర మంత్రి జితేందర్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. తమకు ఇంకా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమ ప్రాధాన్యమన్నారు.
తెలంగాణ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు
మరోవైపు సివిల్ సప్లై కమిషనర్ ఎస్ చౌహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పై డిఓపిటి మంత్రి జితేందర సింగ్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ భక్తులుగా బానిసలుగా,కొందరు అధికారులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రికి ఫిర్యాదు చేశాం. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పై డిఓపిటి మంత్రికి ఫిర్యాదు చేశాం.
భారత రాజ్యాంగాన్ని కాపాడేది బ్యూరోక్రాట్సే. ఈ నెల 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది, ఆ కార్యక్రమంలో అధికారులు గత ప్రభుత్వ తీరును విమర్శించారు. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టే విధంగా వ్యవహరించారు. రేషన్ కార్డులు గతంలో ఇవ్వలేదు....ఇప్పుడు ఇస్తున్నారని అబద్ధాల ప్రచారం చేశారు. ఐఏఎస్, ఐపిఎస్, ప్రతిష్టల దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించారు.. భారత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కేంద్ర డిఓపిటి మంత్రిని కోరాం. ఐఏఎస్ ఐపిఎస్, అధికారులు పార్టీ కండువాలు మార్చుకున్న విధంగా మాట్లాడుతున్నారు.కొందరు తెలంగాణ అధికారుల తీరు మార్చుకోవాలి’ అని సూచించారు శ్రవణ్.
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి