మహిళా ఉద్యోగి ఫొటోలు పోస్టు చేసిన ఏఓ అరెస్ట్‌ | AO Arrested for Posting Photos of Female Employee | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగి ఫొటోలు పోస్టు చేసిన ఏఓ అరెస్ట్‌

Jun 2 2026 9:26 AM | Updated on Jun 2 2026 1:16 PM

AO Arrested for Posting Photos of Female Employee

జనగామ: జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో పనిచేస్తు న్న ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను అనుమతి లేకుండా తీసి, నకిలీ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన కేసులో అదే కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయ్‌రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్‌ పంపించినట్టు సీఐ సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. 

సీఐ మాట్లాడుతూ విజయ్‌రెడ్డి తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి ఆమె ఫొటోలను పోస్టు చేసి, అవమానకరమైన కామెంట్లతో గౌరవానికి భంగం కలిగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. మహిళల పై కార్యాలయాల్లో జరిగే లైంగిక వేధింపులను నిరోధించే పోష్‌ చట్టం–2013 ప్రకా రం ఇది శిక్షార్హమైన నేరమని తెలిపారు. దర్యాప్తులో సేకరించిన డిజిటల్‌ ఆధారాలు, సోషల్‌ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌ తరలించినట్టు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement