‘సీసీ కెమెరాల ఏర్పాటులో మొదటి స్థానం’

Anjani Kumar: Hyderabad Is The First Place In CCTV Surveillance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి  చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలు.. ఆమాన్‌గల్‌కుకి చెందిన వినోద్ కుమార్‌ బీటెక్ చదివి మధ్యలో ఆపేశాడు. కార్ డ్రైవర్‌గా పని చేస్తూ తన స్నేహితులు రాజేష్, షకీల్ తో కలిసి చోరీలు మొదలు పెట్టాడు. ఇతను గతంలో పీడీ యాక్ట్ మీద జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 2017 జైల్ నుంచి బయటకు రాగానే మరోసారి చోరీలకు తెగబడ్డారు. దీంతో మరోసారి నిందుతుడిపై పీడీయాక్ట్‌ కేసు నమోదు చేస్తున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. నిందితుల కోసం నాలుగు జిల్లాల పోలీసులు తీవ్రంగా గాలించారని, నిందితుల నుంచి 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్‌ సెల్యూట్‌! 

అయిదు నెలల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమీక్ష సమావేశంలో సీసీ కెమెరాలు ఎక్కువ శాతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. గత నెల రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేశానని వెల్లడించారు.సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో 7000 సీసీ కెమెరాలు నేను సైతం కార్యక్రమంలో ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు 7 లక్షల 36 వేల సీసీ కెమెరాలు మొత్తం హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో హైదరాబాద్ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో ఉందన్నారు. చదవండి : ఐడియా సూపర్‌.. కానీ బుక్కయ్యావ్‌గా!

కాగా గత కొన్ని రోజుల్లో 36 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు అయ్యాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఒకసారి క్రికెట్ బెట్టింగుకు పాల్పడి కేసులో ఇరుక్కుంటే ఇబ్బందులే కాకుండా భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు అన్ని రకాలుగా పిల్లలపై కన్నేసి ఉంచాలన్నారు. అదే విధంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం హైదరాబాద్‌లో కెమికల్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top