
ఈ వానాకాలంలో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం
కేంద్రం కేటాయించింది 9.8 ఎల్‌ఎంటీలే..
వెంటనే లక్ష మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం
ఎరువుల వాడకం తగ్గించాలన్న కేంద్రం.. ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే వానాకాలం సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. వరితోపాటు పత్తి, ఇతర ఉద్యానవన పంట ల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు మరోసారి యూరియా కోసం పడిగాపులు పడే పరి స్థితి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వానాకాలం పంటలకు ఎరువు బస్తాల కోసం సహకార సంఘం దుకాణాల ముందు రైతులు నిలబడిన దృశ్యాలు పునరావృతం అవుతాయోమే అన్న సందేహం తలెత్తుతోంది.
ఈ సీజన్‌లో వాడకం అధికం
రాష్ట్రంలో ఈ వానాకాలంలో 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 5 ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ సాగు విస్తీర్ణమే 131. 80 లక్షల ఎకరాలు. వీటిలో వరి, పత్తి, మొక్కజొన్నకు యూరియా వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా అవసరమ ని అధికారులు చెపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 9.8 ఎల్‌ఎంటీ యూరియానే రాష్ట్రానికి కేటాయించింది.
గత యాసంగిలో కేటాయించిన 9.8 ఎల్‌ఎంటీల యూరియానే ఈ సీజన్‌కూ కేటాయించడం గమనార్హం. యాసంగిలో పత్తి, సోయాబీన్ వంటి పంటలు లేకపోయి నా 9.8 ఎల్‌ఎంటీ యూరియా సరి పోని పరిస్థితి. కానీ వానాకాలంలోనూ అంతేస్థాయిలో యూరియా కేటాయించడంతో రైతులు ఎరువుల కోసం రోడ్డె క్కే పరిస్థితి తప్పకపోవచ్చునని వ్యవ సాయ రంగ నిపుణులు చెపుతున్నారు.
ఇప్పటి వరకు 1.72 ఎల్‌ఎంటీలే...
ఈ వానాకాలంలో కేంద్రం ఏప్రిల్ నుంచి దశల వారీగా యూరియాను రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్‌లో 1.70 ఎల్‌ఎంటీలు, మేలో 1.60 ఎల్‌ఎంటీల చొప్పున 3.30 ఎల్‌ఎంటీలు రావలసి ఉంది. అయితే కేంద్రం ఏప్రిల్‌లో 1.20 ఎల్‌ఎంటీలు, మేలో 0.52 ఎల్‌ఎంటీలు మాత్రమే ఇచ్చింది. అంటే ఇప్పటివరకు ఇచ్చిన కోటా కేవలం 1.72 ఎల్‌ఎంటీలే.
గత ఏడాది వానాకాలం ప్రారంభానికి ముందే 4 ఎల్‌ఎంటీల యూరియాను నిల్వ చేసినప్పటికీ, ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈసారి కేవ లం 1.72 ఎల్‌ఎంటీలే కేంద్రం పంపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆందోళన చెందుతోంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి తక్షణం లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని కోరారు.
ఎరువుల వాడకం తగ్గించండి..: డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రాష్ట్రాలు ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలని కోరుతుంది.
వానాకాలం వరి, మొక్కజొన్న వంటి పంటలకు యూరియా కీలకమని, తొలిదశలో సరిపడా యూరియా లేకపోతే మొద టి దశ నుంచే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రణాళిక అవసరమని అంటున్నారు.