Recommended Cut Off For Gurukul Seat - Sakshi
Sakshi News home page

గురుకుల సీటుకు సిఫారసు కట్‌

Published Fri, Jul 7 2023 2:50 AM

Recommended cut off for Gurukul seat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురు కుల విద్యాసంస్థల్లో సిఫారసు లేఖలకు కాలం చెల్లింది. గురు కులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగి శాక మిగులు సీట్ల భర్తీలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫా రసు లేఖలను ఏమాత్రం పరిగణ నలోకి తీసుకో రాదని... కేవలం మెరిట్‌ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

గత నెలలో ప్రవే శాల ప్రక్రియను ప్రారంభించిన గురుకుల సొసై టీలు తొలివిడత కౌన్సెలింగ్‌ చేపట్టి సీట్లు పొందిన విద్యార్థులకు గడువులోగా నిర్దేశిత విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టం చేశాయి. మెజారిటీ విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరగా మిగులు సీట్లకు సంబంధించి మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని ఆశావహులు భావించారు.

కానీ గురుకుల సొసైటీలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేయలేదు. మరోవైపు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమవగా బోధన సైతం వేగంగా కొనసాగుతోంది.

మెరిట్‌కే పరిమితం...: రాష్ట్రంలో ఐదు గురుకుల విద్యాసంస్థల సొసైటీలు న్నాయి. మహాత్మా జ్యోతిభాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్నాయి.

తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం పాఠశాల విద్యాశాఖ పరిధిలో కొనసాగుతోంది. ఐదు సొసైటీల పరిధిలో 1005 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో ఐదో తరగతి అడ్మిషన్లతోపాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీలు, ఇంటర్‌ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్‌కు ఏటా అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు.

ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలో ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మిగతా తరగతులకు మాత్రం సొసైటీలు వేరువేరుగా ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు నిర్వహించి మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. 

Advertisement
Advertisement