కొరుక్కుపేట: కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి విజయ్ బొమ్మతో వాహనంలో తిరుగుతూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వివరాలు..టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చైన్నెలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి అఖండ విజయం సాధించారు. దీని అనంతరం ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇందుకోసం, కొలత్తూరు ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మంగళవారం రాత్రి తన వాహనంలో విజయ్ బొమ్మతో వీధి వీధి తిరిగి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ప్రజలు, ఇదంతా ఎన్నికల ప్రచారంఅని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓట్లు అడిగేటప్పుడు డమ్మీ విజయ్ వచ్చారు. తన పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత కూడా, డమ్మీ విజయ్‌తోనే ధన్యవాదాలు తెలిపారు. అసలైన విజయ్ ఎప్పుడు వస్తారు? అని జనం ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, చైన్నె: హోమ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న ప్రముఖ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ లూమియో తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ టీవీలను బుధవారం విడుదల చేసింది. తమ పాపులర్ లైనప్ అయిన లూమియో విజన్ 9, లూమియో విజన్ 7 సిరీస్‌లలో మోస్ట్ అవేటెడ్ 55–ఇంచ్ వేరియంట్లను స్థానికంగా ప్రకటించారు. ఈ సరికొత్త 2026 ఎడిషన్ స్మార్ట్ టీవీల సేల్స్ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, ఇందులోని సరికొత్త అంశాలను , డిజిటల్ సాంకేతికను గురించి ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
వేలూరు: బంగారం, నగదు ఇవ్వకుంటే ఇంటికి దెయ్యాలను పంపిస్తామని బెదిరిస్తున్న మంత్రగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు వేలూరు ఎస్పీకార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ జరిగింది. అదనపు ఎస్పీ అన్నాదురై వినతులను స్వీకరించారు. ఇందులో కాట్పాడి సమీపంలోని వీజీరావ్‌నగర్‌కు చెందిన సేట్టు ఇచ్చిన ఫిర్యాదులో తన భార్య కళ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె ఆరోగ్యం కోసం ముగ్గురు మాంత్రికులను సంప్రదించామని ఆ సమయంలో వారు తన భార్య తల వెంట్రుకలు, కాలు మట్టి, గుడ్డ వంటి వాటిని తీసుకొని ఆరోగ్యం నయం చేసేందుకు గత ఐదు సంవత్సరాలుగా మాంత్రికం చేస్తున్నారు. ఇందుకోసం ముగ్గురూ కలిసి రూ.3లక్షల వరకు నగదు తీసుకున్నారు. అయినప్పటికీ తన భార్య ఆరోగ్యం నయం కాలేదు. అయితే ప్రస్తుతం మరోసారి తన భార్య వద్ద ఉన్న బంగారం, నగదు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. అంగీకరించకపోవడంతో మంత్రాలతో హత్య చేయిస్తామని బెదిరిస్తున్నారని వీటిపై ఇప్పటికే కాట్పాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని రప్పించి రాతత పూర్వకంగా రాసుకొని పంపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం నగదు, బంగారం ఇవ్వకుంటే మీ ఇంటికి రాత్రుల్లో దెయ్యాలను పంపుతామని బెదిరిస్తున్న వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని వారిచ్చిన వినతిలో కోరారు.
కొరుక్కుపేట: కిడ్నీ మార్పిడి కోసం కడలూరు యువకుడి నుంచి రూ.11 లక్షలు మోసం చేసిన యువతిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. కడలూరు జిల్లా నల్లూరు ప్రాంతానికి చెందిన గుణశేఖరన్ కుమార్తె పూంగవనం (55), కొద్ది రోజుల క్రితం జిల్లా ఎస్పీ జయకుమార్‌కు ఫిర్యాదు చేశారు. అందులో, తాను వ్యవసాయ కూలీ అని, తన కొడుకు కుపేంద్రన్ (25)కు రెండు కిడ్నీలు పాడయ్యానని, డయాలసిస్ లేక కిడ్నీ మార్పిడి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో కడలూరు జిల్లా, చేపక్కంకు చెందిన ఆమె బంధువు కడిముత్తు ద్వారా నామక్కల్ జిల్లాకు చెందిన ప్రియ పరిచయమైంది. ఈరోడ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అలాంటి సర్జరీలు చేస్తారని ఆమె నమ్మించి పలు విడతల్లో రూ.26 లక్షలు తీసుకుంది. కానీ కిడ్నీ మార్పిడి జరగకపోవడంతో కుపేంద్రన్ చనిపోయాడు. తరువాత నగదు తిరిగి ఇవ్వలేనని ప్రియ చెప్పి, తాను రూ. 15 లక్షలు, కటిముత్తు రూ.3.50లక్షలు ఇస్తామని ముందుకొచ్చారు.మొత్తం డబ్బు చెల్లిస్తామని ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. అందులో కటిముత్తు మొత్తం డబ్బు ఇచ్చేశాడు. కానీ ప్రియ రూ.4 లక్షలు ఇచ్చి, మిగిలిన రూ.11 లక్షలు ఇవ్వకుండా ఆమెను మోసం చేస్తూనే ఉన్నారు. అందువల్ల, దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని అతను చెప్పాడు. అనంతరం జిల్లా క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో, నామక్కల్ జిల్లాకు చెందిన కుమారప్ప పల్లిపాలయంకు చెందిన ప్రియ (37)ను అరెస్టు చేశారు. ఆమెను కడలూరు కోర్టులో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలించారు.


