సాక్షి, చైన్నె: తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలతో దశాబ్దాలుగా విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్న ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ బ్రిటానియా మిల్క్ బికిస్ సరికొత్త వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలకు సరదాగా, ఇంటరాక్టివ్ పద్ధతిలో మహాకవి తిరువళ్లువర్ అందించిన అమూల్యమైన శ్రీతిరుక్కురళ్‌శ్రీ ను నేర్పించేందుకు శ్రీమిల్క్ బికిస్ తిరుక్కురళ్ ఛాలెంజ్‌శ్రీను బుధవారం చైన్నెలోని చారిత్రాత్మక వళ్లువర్ కొట్టం వేదికగా ప్రారంభించింది. సుమారు 2,000 సంవత్సరాల క్రితం తిరువళ్లువర్ రచించిన 1,330 కురళ్‌లు (పద్యాలు) జీవితం, బంధాలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలపై నేటికీ నిరంతర మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని నేటి డిజిటల్ యుగం పిల్లలకు మరింత ఆకర్షణీయంగా చేరవేయడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశంగా ప్రకటించారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ పండితులు, కళాకారులు అయిన డాక్టర్ జి. జ్ఞానసంబంధన్, సుకి శివం, భారతి భాస్కర్ చ యువ సంగీత విద్వాంసుడు లిడియన్ నాదస్వరం, బ్రిటానియా జీఎం అర్చనా బలరామన్, టాలెంటెడ్ స్ట్రాటజీ ప్రతినిధి రియా శర్మలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి తరం పిల్లలు కంటెంట్‌ను ఎలా స్వీకరిస్తున్నారు, కథలు , సంగీతం ద్వారా తిరుక్కురళ్‌ను వారి దైనందిన జీవితంలోకి ఎలా తీసుకెళ్లవచ్చనే అంశాలపై వారు తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. వేర్వేరు ప్యాకెట్లలోని ఈ బిస్కెట్లను సేకరించి, ఆ పదాలను వరుసగా అమర్చడం ద్వారా స్నేహం, విద్య, పట్టుదల వంటి ఇతివృత్తాలతో కూడిన మూడు పూర్తి తిరుక్కురళ్లను రూపొందించే విధంగా, ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్ (ఖఖ) కోడ్ ద్వారా ప్రత్యేక మైక్రోసైట్‌ను సందర్శించి, తాము కనుగొన్న పదాలను డిజిటల్‌గా జోడించి పూర్తి పద్యంగా మార్చడం ద్వారా బహుమతులు కూడా గెలుచుకోవచ్చు అని వివరించారు.


