ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం
అన్నానగర్: విరుదునగర్‌లోని ఆర్‌ఆర్ నగర్ సమీపంలో ఉన్న తడంగం గ్రామంలోని ప్రభు త్వ యూనియన్ ఉన్నత పాఠశాలకు సోమ వారం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యా రు. ఆ సమయంలో, ఒక తరగతి గదిలో పొగ రావడం గమనించి వారు అక్కడికి వెళ్లారు. ఆ గదిలోని చాపకు నిప్పంటుకుని, ఆ మంటలు అక్కడున్న వస్తువులకు వ్యాపిస్తుండటం చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఆ గదిలోని వస్తువులు, క్రీడా పరికరాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి.
సమర్థవంతంగా
మెడికల్ ఇంటర్న్ చికిత్స
సాక్షి, చైన్నె: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 23 ఏళ్ల యువకుడికి ఎస్‌ఆర్‌ఎం గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు సమర్థవంతంగా మెడికల్ ఇంటర్న్ చికిత్సలను అందించారు. సోమవారం ఈ వివరాలను డాక్టర్ పి. విజయన్, డాక్టర్ అబ్దుల్ హకీమ్, డాక్టర్ విష్ణు తేజ ముద్దుల నేతృత్వంలోని బృందం ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన సమంలో ఛాతీకి రెండు వైపులా గాయాలు, ఊపిరితిత్తులు కుచించుకుపోవడం, కాలేయం తినడం, ఛాతీలో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల చుట్టూ గాలి లీక్ అవ్వడం, పొత్తికడుపులో రక్తస్రావం. ప్రమాద తీవ్రత కారణంగా గుండె కూడా దెబ్బతిని, రోగి షాక్‌లోకి వెళ్లి పోయినట్టు వివరించారు. సాధారణ చికిత్సలు చేసే సమయం లేక పోవడంతో ప్రాణరక్షణ చికిత్స – డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ పై దృష్టి పెట్టామన్నారు. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు చేసే అత్యవసర శస్త్రచికిత్స అని, దీని ప్రధాన లక్ష్యం రోగిని పూర్తిగా నయం చేయడమేనని వివరించారు. సర్జరీ తర్వాత రోగిని వెంటిలేటర్ పై ఉంచి 48 గంటల పాటు నిశితంగా పర్యవేక్షించామన్నారు. రెండు వారాల ఇంటెన్సివ్ కేర్ తర్వాత పూర్తిగా ఆ యువకుడు కోలుకున్నట్టు తెలిపారు.
‘సాఫ్టెల్’ హోమ్ గ్రైండర్ ఆవిష్కరణ
సాక్షి,చైన్నె : అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ ఇంట్లోనే అన్ని రకాల పిండి తయారీ కోసం సాఫ్టెల్ హోమ్ గ్రైండర్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా మహిళల సౌకర్యార్తం తీర్చిదిద్దారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణ గురించి వివరించారు.గత 35 ఏళ్లుగా తయారీ రంగంలో విశేష అనుభవం ఉన్న సాఫ్టెల్, ఇప్పుడు ఆధునిక వంటగదికి సరిపోయేలా కాంపాక్ట్ పిండి మిల్లు పేరిట దీనిని రూపొందించింది. ఇందులో రాతితో గ్రైండింగ్ చేసే ప్రక్రియ ఉండటం వల్ల ధాన్యాల సహజ రుచి, పోషకాలు అలాగే ఉంటాయి. ఇది గంటకు 7.5 నుండి 10 కిలోల ధాన్యాలను పిండిగా మార్చగలదు. గంటకు కేవలం ఒక యూనిట్ విద్యుత్తును మాత్రమే వాడుకుంటుంది. వినియోగదారుల సౌకర్యార్థం ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, మ్యాన్యువల్ అనే మూడు మోడళ్లలో దీనిని అందుబాటులోకి తెచ్చారు.
అనారోగ్య సమస్యలతో ఆవేదన
– పదవీ విరమణ పొందిన దంపతుల ఆత్మహత్య
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలై ప్రాంతానికి చెందిన అరుముగం (78). ఇతని భార్య రుక్మణి (68). ఆమె ఉడుమలై ఆవిన్ పాలగంలో కార్యదర్శిగా పనిచేస్తుండేది. అరు ముగం అక్కడ సహాయకుడిగా పనిచేస్తు వచ్చా డు. పదవీ విరమణ తర్వాత, రుక్మణి, అరుముగం తమ కుమారుడు సెల్వకుమార్‌తో కలి సి జీవిస్తున్నారు. ఈ స్థితుల్లో, సెల్వకుమార్ తన కుమార్తె చదువుల కోసం 6 నెలల క్రితం తల్లిదండ్రులకు దూరమై, కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ సమీపంలో ఉన్న తన భార్య తెన్మొళి ఇంట్లో స్థిరపడ్డారు. రుక్మణి గత 15 సంవత్సరాలుగా కిడ్నీలో రాళ్ల కారణంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ కారణంగా, రుక్మణి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని తన భర్తకు చెప్పింది. దీంతో వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని అన్నూర్ సమీపంలోని రుక్మణి తల్లి ఇంటికి వచ్చారు. ఆదివారం అక్కడ వారు విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడికి చేరు కున్న రుక్మిణి మేనల్లుడు రితుబరన్, అపస్మారక స్థితిలో ఉన్న అరుముగం, రుక్మణిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కానీ వారిద్దరూ మార్గమధ్యంలోనే మరణించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


