టీవీకే అభ్యర్థి నామినేషన్‌ దాఖలు | - | Sakshi
Sakshi News home page

టీవీకే అభ్యర్థి నామినేషన్‌ దాఖలు

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

తిరువళ్లూరు: టివీకే తిరువళ్లూరు అభ్యర్థి డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ తన మద్దతుదారులతో కలసి శనివారం ఉదయం ఆర్వో రవిచంద్రన్‌కు తన నామినేషన్‌లను దాఖలు చేశారు. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు రానున్న 23న ఎన్నికలు జరగనుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్‌ల పర్వం గత 30న ప్రారంభమైంది. ప్రస్తుతం సోమవారం వరకు గడువు వున్న క్రమంలో శనివారం ఉదయం జిల్లా వ్యాప్తంగా వున్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్‌ దాఖలయ్యాయి. తిరువళ్లూరులో టీవీకే అభ్యర్థి డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, పూందమల్లిలో డీఎంకే అభ్యర్థి కృష్ణస్వామి సహా పలువురు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇప్పటివరకు గుమ్మిడిపూండిలో 19, పొన్నేరి 15, తిరుత్తణి 15, తిరువళ్లూరు 14, పూందమల్లి 09, ఆవడి 19, మధురవాయల్‌ 27, అంబత్తూరు 21, మాధవరం 19, తిరువొత్తియూర్‌లో 15 నామినేషన్లు సహా మొత్తం 173 నామినేషన్‌లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నామినేషన్‌కు సోమ వారం ఒక్కరోజే గడవు వున్న క్రమంలో భారీగా నామినేషన్‌లు దాఖలు కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement