సాక్షి, చైన్నె: క్రైస్తవులకు తీవ్ర అన్యాయాన్ని తలపెట్టే విధంగా కేంద్రం తీసుకొస్తున్న ఎఫ్‌సీఆర్‌ఏ గురించి అన్నాడీఎంకే తన స్పష్టతను ప్రజలకు తెలియజేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లును వ్యతిరేకిస్తామని, ప్రజల పక్షాన నిలబడుతామని చెప్పే ధైర్యం పళణి స్వామికి ఉందా? అని సవాల్ చేస్తూ నిలదీశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం స్టాలిన్ శనివారం ప్రసంగించారు. గతంలో ముస్లింలకు తీవ్ర ద్రోహాన్ని పళణిస్వామి తలబెట్టారని వివరిస్తూ తాజాగా ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) విషయంలో క్రైస్తవులకు పళణి స్వామి ద్రోహం తలబెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.
ఏదీ మైనారిటీలకు రక్షణ..?
బీజేపీ ప్రవేశపెట్టిన ఈ చట్టం మైనారిటీ సంస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందని, దీనిని అడ్డుకోవాలంటే మళ్లీ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జాలర్ల కోసం కొత్త హామీలను ఈ సందర్భంగా ప్రకటించారు. జాలర్ల సంక్షేమ బోర్డు సభ్యుల వయో పరిమితి 65 నుంచి 70 సంవత్సరాలకు గా పెంచి, ఆ మేరకు ప్రయోజనాలను వారికి అందించనున్నామని వివరించారు. అలాగే 70 నుండి 75 ఏళ్ల వయస్సు వరకు ప్రతి నెలా అదనపు పెన్షన్ అందజేస్తామని ప్రకటించారు. జాలర్లకు ఎల్ల వేళలల నిజమైన స్నేహితుడిగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఉంటూ వస్తున్నట్టు పేర్కొన్నారు. జాలర్లపై శ్రీలంక నావికాదళం చేస్తూ వస్తున్న దాడులను గుర్తు చేస్తూ, ఈ వ్యవహారంలో శాశ్వత పరిష్కరాన్ని చూపించంలో కేంద్రం ప్రభ్తువం, భారత విదేశీ వ్యవహారాల శాఖ పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.
మత్స్యకార గ్రామాల్లో వాకింగ్
అంతకుముందు, సీఎం స్టాలిన్ కోవలం మత్స్యకార గ్రామంలో వాకింగ్ నిర్వహించారు. ఇంటింటికీ తిరు గుతూ పురుషులు, మహిళలు, వృద్ధులను కలుస్తూ ’ఉదయించే సూర్యుడు’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.గ్రామస్థులు సీఎం దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు అనంతరం ఆయన నాగర్ కోయిల్‌లో పాదయాత్రతో ప్రజల్ని ఆకర్షించారు.
సీబీఎస్‌ఈ త్రిభాషాపై ఫైర్
సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుండి అమల్లోకి రానున్న త్రిభాషా విధానంపై సీఎం స్టాలిన్‌వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ పేజీలో కేంద్రాన్ని నిలదీస్తూ వ్యాఖ్యలు చేశారు. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలలో మార్పుల పేరిట కేంద్రం హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తన్నట్టు ధ్వజమెత్తారు. దీనిని విద్యా సంస్కరణగా చూడలేమని, ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న భాషా వివక్ష అని విమర్శించారు. జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ మాట్లాడని రాష్ట్రాలపై బలవతంగా ఆ భాషను రుద్దేందుకు కేంద్రం మళ్లీ ప్రయత్నాలు చేపట్టిందన్నారు. భారతీయ భాషలను ప్రోత్సహిస్తున్నామని ఓ వైపుచేబుతూనే మరో వైపు కేవలం హిందీకి మా త్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
దక్షిణాది విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని కోరుతున్న కేంద్రం, హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులు తమిళం, తెలు గు, కన్నడ, మలయాళం వంటి భాషలను నేర్చుకునేలా ఎందుకు నిబంధన పెట్టలేదని ఆయన ప్రశ్నించా రు. ఇందులో స్పష్టత లేకపోవడమే వివక్షకు నిదర్శన మని అన్నారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి తగినంత మంది ఉపాధ్యాయులు, శిక్షణ, మౌలిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయని స్టాలిన్ ప్రశ్నించా రు. కేంద్రీయ విద్యాలయాలలో తమిళ ఉపాధ్యా యులను నియమించలేని కేంద్రం, రాష్ట్రాలకు పాఠాలు చెప్పడం కపట నాటకం అని మండిపడ్డారు.
బహిరంగ సభకు తరలివచ్చిన జనం
జాలర్ల గ్రామాల వద్ద ప్రజలను పలకరిస్తూ వాకింగ్ చేస్తున్న సీఎం స్టాలిన్
ఆప్యాయంగాపలకరింపు... తనిఖీ
నాగర్ కోయిల్‌లో స్టాలిన్ వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయడం స్థానికంగా కలకలం రేపింది. కొట్టార్ సమీపంలోని పారకై ్క రోడ్ జంక్షన్ వద్దకు చేరుకోగానే, అక్కడ విధుల్లో ఉన్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను ఆపారు. నిబంధనల ప్రకారం అధికారులు వాహనాన్ని, అందులోని పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సీఎం వాహనం దిగి అధికారులకు సహకరించారు. తనిఖీలో ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లభించకపోవడంతో అధికారులు కొద్ది నిమిషాల్లోనే వాహనాన్ని వెళ్లనిచ్చారు.


