వేలూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేలూరు సీఎస్‌ఐ డయాసీస్ బిషఫ్ శర్మ నిత్యానందం అన్నారు క్రైస్తవుల ప్రభువైన ఏసుప్రభువుకు శిలువ వేసిన రోజున గుడ్‌ప్రైడేగా జరుపుకుంటారు. దీంతో శనివారం ఉదయం వేలూరు సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ప్రధాన పాస్టర్ సైమన్ అధ్యక్షతన రక్తదానం శిబిరాన్ని బిషఫ్ ప్రారంభించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో అధిక సార్లు రక్తదానం చేసిన వారికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో వేలూరు సీఎంసీ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి డాక్టర్ డాలీ డోనియేల్, చర్చి కార్యదర్శి జోసువా, కోశాధికారి ఆరోన్, పాస్టర్‌లు పాల్గొన్నారు.


