సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం శనివారం జోరుగా సాగింది. విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం గత 30వ తేదీ నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే.తొలి రోజున సీఎం స్టాలిన్‌తో పాటుగా టీవీకే అధ్యక్షుడు విజయ్ తదితరులు నామినేషన్లు వేశారు. ఇక, శనివారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేగం పుంజుకుంది. ఆదివారం సెలవు తదుపరి సోమవారం నామినేషన్లకు చివరి రోజు కావడం గమనార్హం. దీంతో తాజాగా పెద్దఎత్తున డీఎంకే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. సోమవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌తోపాటుగా ఆపార్టీ వర్గాలు నామినేషన్లు సమర్పించనున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాలలో 2,496 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులో 1,958, మహిళలు 537, ఇతరులు ఒకరు ఉన్నారు.
కార్తీక్ మోహన్ నామినేషన్ దాఖలు
విల్లివాక్కంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి, మంత్రి పి.కె. శేఖర్ బా బు సమక్షంలో విల్లివాక్కం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. విల్లివాక్కం సిట్టింగ్ ఎమ్మెల్యే వెట్రి అళగన్, పశ్చిమ విభాగం కార్యదర్శి పి. జైన్, తూర్పు విభాగం కార్యదర్శి వి. వాసు కూటమి పార్టీల కీలక నేతలు వెన్నంటి ఉన్నారు. ఈసందర్భంగా అభ్యర్థి కార్తీక్ మోహన్ మాట్లాడుతూ, ‘విల్లివాక్కం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాపేర్కొన్నారు.


