తమిళసినిమా: నటుడు ధనుష్ తాజాగా నటించిన చిత్రం కరా. నటి మమితాబైజు నాయకిగా నటించిన ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్,సురాజ్ వెంజరముడు, జయరాం, పృధ్వీ పాండిరాజన్, శ్రీజారవి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 30వ తేధీన తెరపైకి రావడానికి సిధ్ధం అవుతోంది. తనన నమ్మిన వారిని హీరో ఎలా కాపాడారు అన్న పలు అసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను యూనిట్ వర్గాలు ఇటీవల విడుదల చేశారు. అదే విధంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ధనుష్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్ టెయినర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందిందన్నది గమనార్హం.


