నీ ఫరెవర్‌ | - | Sakshi
Sakshi News home page

నీ ఫరెవర్‌

Mar 28 2026 7:52 AM | Updated on Mar 28 2026 7:52 AM

వైవిధ్య కథనాలతో

తమిళసినిమా: సినిమా కొత్త పుంతలు తొక్కుతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం దర్శకులు కొంగొత్త ఆలోచనలతో కథలను తెరకెక్కిస్తున్నారు. భారీతనం కంటే మంచి కంటెంట్‌తో చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల అలాంటి చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలా తాజాగా రూపొందిన చిత్రం నీ ఫరెవర్‌. అమ్మాయిలకు దూరంగా , ప్రేమించడం కూడా తెలియని ఒక యువకుడు ప్రేమ ఇతివత్తంతో ఒక ప్రాజెక్ట్‌ను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రేమ అనుభవం తెలుసుకోవడానికి యువతి కోసం పార్టీలో వెంట తిరుగుతుంటాడు. ఇంచుమించు అలాంటి ఒక లవ్‌ సబ్జెక్టుతో షార్ట్‌ ఫిలిం చేయాలని నిర్మాత కోరడంతో ప్రేమ అంటేనే గిట్టని ఒక యువతి ప్రేమ అనుభవాన్ని పొందడానికి ఒక అమాయక యువకుడి కోసం గాలిస్తుంది. అలా ఆ యువతి, యువకుడు తమ తమ అవసరాల కోసం ప్రేమించుకుటారు. అలా మొదలైన వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ఆ యువకుడు ప్రేమ గురించి ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి ? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం నీ ఫరెవర్‌. జెన్‌ స్టూడియోస్‌ పతాకంపై పుగళ్‌, ఈడెన్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా అశోక్‌కుమార్‌ కలైవాణి దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుదర్శన్‌ గోవింద్‌, అర్చన రవి జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు వైజీ.మహేంద్రన్‌, నిళగళ్‌రవి, ఎంజే.శ్రీరామ్‌, రితిక శ్రీనివాస్‌ చెల్లా, బ్రిందా ముఖ్యపాత్రలు పోషించారు. అశ్విన్‌హేమంత్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.

బ్లడీ పాలిటిక్స్‌ సెట్లో

రాజుమురుగన్‌

తమిళసినిమా: నటుడు గౌతమ్‌రామ్‌ కార్తీక్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్లడీ పాలిటిక్స్‌. ఈ చిత్రం ద్వారా దినారాఘవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు రాజుమురుగన్‌ శిష్యుడు అన్నది గమనార్హం. అంజనానేత్రన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌, పి.వాసు, ఏ.వెంకటేశ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు గణేష్‌ కే.బాబు తన డ్రాఫ్ట్‌ బై జీకేబీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్‌ వి.ముత్తుకుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. సమకాలీన రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఈ చిత్ర టైటిల్‌తో కూడిన టీజర్‌ ఇటీవల విడుదల చేశారు. ఇది చిత్రంపై ఆసక్తిని పెంచేసిందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు రాజుమురుగన్‌ తన శిష్యుడు తెరకెక్కిస్తున్న బ్లడీ పాలిటిక్స్‌ చిత్ర షూటింగ్‌కు వెళ్లి పర్యవేక్షించి వారిని ప్రోత్సహించే విధంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజిటింగ్‌ ఈ చిత్ర యూనిట్‌కు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని దర్శకుడు దినారాఘవన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రదీప్‌ కాళీరాజా చాయాగ్రహణం, శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement