సాక్షి, చైన్నె: తమిళనాడులో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. ఇందుక ఓసం పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా ప్రత్యేక ఏర్పాట్లకు జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ఆదేశించారు.రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమైన విషయం తెలిసిందే. వాహన తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్లలో నిఘాను పెంచి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిపిన తనిఖీలలో చైన్నె కోయంబేడు, సెంట్రల్ రైల్వే స్టేషన్‌లలో రూ. 43 లక్షలు సీజ్ చేశారు. అలాగే రూ. 28 లక్షలు విలువైన గంజాయి పట్టుబడింది. శివగంగైలో 430 సవర్ల బంగారం పట్టుకున్నారు.ఈ మేరకుతనిఖిలు విస్తృతంగా జరుగుతున్నాయి. అలాగే వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు జరిగాయి. సైకత శిల్పం ఏర్పాటుతో పాటూ వినూత్న రీతులల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.
విస్తృతంగా..
రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలోని 75032 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో 30,979 పట్టణ ప్రాంతాలలో, 44,065 రూరల్ ప్రాంతాలలో ఉన్నాయి. వీటిలో 265 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల నిమిత్తం మోడర్‌గా తీర్చిదిద్దనున్నారు. 258 స్టేషన్లను మహిళలే సారఽథులుగా నిర్వహించనున్నారు. అన్ని స్టేషన్లలో 100 శాతం వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికలను నిఘా నీడలో నిర్వహించేందుకు సన్నద్దమయ్యారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓటర్ల కోసం సురక్షితమైన తాగునీరు, వేచి ఉండేందుకు ప్రత్యేక ప్రదేశంలో నీడ ( జ్చిఛ్ఛీ) సౌకర్యం కల్పించాలని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దివ్యాంగులు, వృద్దుల కోసం సరైన వాలు కలిగిన ర్యాంపులు ఏర్పాటు చేయాలని పేర్కొంటూ.. వెలుతురు, నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, ప్రామాణిక ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు, స్పష్టమైన సైన్ బోర్డులు ఉండే విధంగా చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఓటర్లు తమ వంతు వచ్చే వరకు నిలబడకుండా, క్యూ లైన్లలో మధ్యమధ్యలో కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
మొబైల్ ఫోన్ డిపాజిట్ సదుపాయం:
ఓటర్ల సౌకర్యార్థం ఈసారి ఒక కొత్త చొరవ తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించరు. ఈ దృష్ట్యా, కేంద్రం వెలుపల ఫోన్లను భద్రపరిచేందుకు మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీ కల్పిస్తారు. ఓటర్లు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న వాలంటీర్లకు అందించి, ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకోవచ్చు అని సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల సహాయార్థం ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటర్లకు వారి సీరియల్ నంబర్ , ఓటు వేయాల్సిన గదిని గుర్తించడంలో సహాయ పడుతారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నాలుగు రకాల ప్రామాణిక పోస్టర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.


