విధుల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

విధుల నిర్వహణ

Mar 12 2026 7:34 AM | Updated on Mar 12 2026 7:34 AM

● ప్రజలతో ప్రేమతో మెలగాలి.. ● సివిల్స్‌ ర్యాంకర్లకు సీఎం స్టాలిన్‌ పిలుపు ● కుటుంబాన్ని మరవొద్దని సూచన ● యూపీఎస్సీ ర్యాంకర్లకు సత్కారం

● ప్రజలతో ప్రేమతో మెలగాలి.. ● సివిల్స్‌ ర్యాంకర్లకు సీఎం స్టాలిన్‌ పిలుపు ● కుటుంబాన్ని మరవొద్దని సూచన ● యూపీఎస్సీ ర్యాంకర్లకు సత్కారం
సేవా దృక్పథంతో..

సాక్షి, చైన్నె: నాన్‌ మొదల్వన్‌ పథకం ద్వారా శిక్షణ పొందిన 60 మందిలో 56 మంది అఖిల భారత సర్వీసుల పరీక్షల్లో విజయం సాధించి ప్రజాసేవకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ యువ అధికారులను తమిళనాడు స్టాలిన్‌ అభినందిస్తూ సత్కార వేడుక బుధవారం చైన్నెలోని విక్టోరియా పబ్లిక్‌ హాల్‌లో నిర్వహించారు. సివిల్‌ సర్వీసెస్‌ విజేతల సన్మాన వేడుక’కు సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి మాజరయ్యారు. సివిల్‌ సర్వీసెస్‌ 2025 ఫలితాల్లో మెరిసిన తమిళనాడు విద్యార్థులను అభినంధించారు. మొత్తం 60 మంది ఎంపికవ్వగా ఇందులో 56 మంది ప్రభుత్వ పథకం ’నాన్‌ మొదల్వన్‌’ ద్వారా లబ్ధి పొందిన వారు కావడం విశేషం. వీరిలో టాప్‌ ర్యాంకర్లుగా ఎం. రాజేశ్వరి సువి (ఆలిండియా 2వ ర్యాంక్‌), రాజ మొహిద్దీన్‌ (7వ ర్యాంక్‌), ఆర్‌. శ్రుతి (18వ ర్యాంక్‌) సాధించి రాష్ట్రానికి కీర్తి తెచ్చారు. తమిళ మాధ్యమంలో అరుణ్‌ కుమార్‌ అనే అభ్యర్థి మెయిన్స్‌ పరీక్షను రాసి 585వ ర్యాంక్‌ సాధించడం మరో విశేషం. వీరిని సత్కరించినానంతరం సీఎం స్టాలిన్‌ ప్రసంగించారు.

వెనుకబడిన విద్యార్థులకు అండ..

గ్రామీణ, వెనుకబడిన విద్యార్థులకు సివిల్‌ సర్వీసెస్‌ చేరువ చేయడమే తన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ద్రవిడ మోడల్‌ ప్రభుత్వ కృషికి తాజా ఫలితాలు మరో నిదర్శనంగా వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నుండి సివిల్‌ సర్వీసెస్‌ ఎంపికలు తగ్గుముఖం పట్టిన సమాచారం గతంలో ఉండేదన్నారు. దానిని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ఇందులో నాన్‌ మొదల్వన్‌ పథకం కీలకంగా మారిందన్నారు. ఈ ఏడాది తమిళనాడు నుండి ఎంపికై న 60 మంది విజేతల్లో 56 మంది నాన్‌ మొదల్వన్‌ పథకం ద్వారా శిక్షణ, ప్రోత్సాహకాలు పొందిన వారే కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ఉన్నత స్థాయి కోచింగ్‌, ఇంటర్వ్యూ శిక్షణ అందించడం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, ఇందుకు అధికారులు శిక్షకులు కూడా అభినందనీయులని కొనియాడారు.

సీఎం స్టాలిన్‌తో సివిల్స్‌ టాపర్లు

సీఎం సమక్షంలో వివాహాలు

యువ అధికారులకు చనలు

విజేతలను ఉద్దేశించి సీఎం స్టాలిన్‌ పలు కీలక సూచనలు చేశారు. అధికారులు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదని, సామాన్య ప్రజలతో ప్రేమగా, మర్యాదగా ప్రవర్తిస్తేనే ప్రతి ఒక్కరి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సామాజిక న్యాయం, మానవతా దృక్పథాన్ని అలవరచుకుని రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటు పడాలని పిలుపు నిచ్చారు. ఎంత బిజీగా ఉన్నా, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కనీసం రోజుకు ఐదు నిమిషాలైనా మాట్లాడండి. వారి ప్రేమ మీ కెరీర్‌ ఎదుగుదలకు తోడ్పడుతుందని సలహా ఇచ్చారు. తమిళనాడు నుంచి మరిన్ని వందల మంది సివిల్‌ సర్వెంట్లను తయారు చేసేందుకు ద్రవిడ మోడల్‌ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటు నందిస్తుందని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మంత్రులు టీఆర్‌బీ రాజ, కయల్వెలి సెల్వరాజర్‌, మేయర్‌ ప్రియ, సీఎస్‌ మురుగానందం హాజరయ్యారు.

విధుల్లోకి చేరగానే ప్రజలతో మర్యాద

పూర్వకంగా మెలగడం, ప్రేమతో

పలకరించడం మరవకూడదని సివిల్‌ సర్వీసు ర్యాంకర్లకు సీఎం ఎంకే స్టాలిన్‌

పిలుపు నిచ్చారు. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో పడి వ్యక్తిగత కుటుంబాన్ని మరవ కుండా, తల్లిదండ్రులను తరచూ పలకరిస్తూ

ముందుకు సాగాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement