సాక్షి,చైన్నె: వరుసగా ఐదు రోజుల పాటు 250 కంటే ఎక్కువ సార్లు గుండె లయ తప్పిన పరిస్థితి( కార్డియాక్ అరెస్ట్)కి చేరుకున్న 65 ఏళ్ల పండితుడికి అత్యాధునిక చికిత్సతో సిమ్స్ వైద్యులు పునర్జీవం పోశారు. ఈ వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వివరించారు. సదరు రోగి గతంలో (2012లో) బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. అయితే ఇటీవల మళ్లీ గుండె ధమనులలో బ్లాక్స్ ఏర్పడటం, గుండె పంపింగ్ సామర్థ్యం 27 శాతానికి పడిపోవడంతో సిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వి.వి. బాషి నేతృత్వంలోని బృందం అత్యంత ప్రమాదకరమైన శ్రీరీడో బైపాస్‌శ్రీ (రెండోసారి బైపాస్) సర్జరీని నిర్వహించింది. శస్త్రచికిత్స ముగిసిన 24 గంటల తర్వాత రోగికి శ్రీవెంట్రిక్యులర్ టాచీ కార్డియా(వీటీ) స్టార్మ్‌శ్రీ అనే ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. ఇందులో గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటూ నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని అదుపు చేయడానికి వైద్యులు ఐదు రోజుల వ్యవధిలో 250 కంటే ఎక్కువ డీఫిబ్రిలేటర్ విద్యుత్ షాక్‌లు ఇవ్వాల్సి వచ్చింది. సాధారణంగా ఇన్ని షాక్‌ల తర్వాత కోలుకోవడం అసాధ్యమని భావిస్తారు. మందులకు లొంగని ఈ సమస్యను పరిష్కరించడానికి, క్లినికల్ లీడ్ డాక్టర్ సంజయ్ పి. వి నేతృత్వంలోని ఎలక్ట్రోఫిజియాలజీ బృందం రంగంలోకి దిగింది. 3ఈ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించి గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాలు ఎక్కడ పుడుతున్నాయో గుర్తించారు. గుండె లోపలి భాగం నుండే కాకుండా, బయటి ఉపరితలం నుండి కూడా రేడియోఫ్రీక్వెన్సీ శక్తిని పంపి అసాధారణ సర్యూట్‌లను తొలగించారు. లయ తప్పిన గుండెకు జీవం పోశారు. తన 45 ఏళ్ల అనుభవంలో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా ఇన్ని షాక్‌లు అవసరమైన రోగిని చూడటం ఇదే మొదటిసారి అని, అది కూడా ఆయన కోలుకోవడం నిజంగా ఒక అద్భుతం,్ఙ అని డాక్టర్ వి.వి. బాషి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా ఆయన శరీరంలో ఆటోమేటెడ్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్–డీఫిబ్రిలేటర్ పరికరాన్ని అమర్చినట్టు వివరించారు.


