తిరువళ్లూరు: అక్రమంగా దేశంలోకి చొరబడిన ఇద్దరు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టులో అక్రమంగా చొరబడి ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులు తలదాచుకుంటున్నట్టు ఉగ్రవాధ నిరోధక విభాగం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో చైన్నెకు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం ఇన్పెక్టర్ అరుణ్‌పాండ్యన్ నేతృత్వంలోని పోలీసుల బృందం సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తాపీ మేసీ్త్ర పనులు చేస్తున్న వసీమ్ అక్రమ్(24), ఎండి రసూల్(20)ను అరెస్టు చేసి సెవ్వాపేట పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇద్దరు అక్రమంగా భారత్‌లో చొరబడి తాపీ పనులు చేసుకుంటున్నట్టు నిర్ధారించి రిమాండ్‌కు తరలించారు.


