కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన ప్రచారం | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన ప్రచారం

Mar 10 2026 7:35 AM | Updated on Mar 10 2026 7:35 AM

సాక్షి,చైన్నె : రొంబా ఉప్పు...రొంబా రొంబా తప్పు పేరుతో నగరానికి చెందిన ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఐనూ) ఆధ్వర్యంలో కిడ్నీ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోమవారం ఈ వివరాలను ఐనూ చీఫ్‌ యూరాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ , యూరో–ఆంకాలజిస్ట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ బాలకృష్ణన్‌ తెలిపారు .ఈ మేరకు సోమవారం నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, రోజువారీ ఆహారంలో అధిక ఉప్పు వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను , మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ‘రొంబా ఉప్పు...రొంబా రొంబా తప్పు‘ అనే ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. అలాగే ఈ నెల 12 నుంచి 31 వరకు 30 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఉచిత కిడ్నీ స్క్రీనింగ్‌ను అందిస్తుందన్నారు.

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతినడంరక్తపోటు మూత్రపిండాల వ్యాధి మధ్య సంబంధాన్ని అవగాహన పెంచారు. ఐనూ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌ అండ్‌ రీనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎం. నవీనాథ్‌ మాట్లాడుతూ రోజువారీ ఆహారంలో అధిక ఉప్పు వంటి సాధారణ విషయం కాలక్రమేణా మూత్రపిండాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందని చాలా మందికి తెలియదన్నారు. అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటును పెంచుతుందన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మూత్రపిండాల కాపాడటంలో చాలా దోహదపడతాయని మేము అవగాహన కల్పించాలనుకుంటున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement