మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం
వేలూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేలూరు పట్టణం గాంధీనగర్‌లో ని ఇందిరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళల సంక్షేమాన్ని ప్రొత్సహించడానికి మహిళల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం అవసరమైన మహిళలకు శస్త్ర చికిత్సలు చేసేందుకు సిఫార్సు చేశారు. సుమారు 150 మందికి పైగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా అందజేశారు.
గ్రామాలకు అంబులెన్స్ వితరణ
తిరువళ్లూరు: మూడు గ్రామాలకు ఉపయోగపడేలా రూ.10లక్షల విలువ చేసే అంబులెన్స్‌ను అన్నాడీఎంకే నేత రాజన్ విరాళంగా అందజేశారు. అంబులెన్స్‌ను అన్నాడీఎంకే జిల్లా కన్వీనర్ మాజీ మంత్రి రమణ శనివారం రాత్రి ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కన్నూరు గ్రామానికి చెందిన రాజన్. ఇతను అన్నాడీఎంకేలో తమిళాభివృద్ధి విభాగం యూ నియన్ కార్యదర్శి. రాజన్ తన సొంత నిధులతో అంబులెన్స్, ఫ్రీజర్, 500 మందికి సిల్వ ర్ పాత్రలు, వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.రమణ ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. రమణ మాట్లాడు తూ అంబులెన్స్ కన్నూరు, పుదుపట్టు, కొట్టయూరు గ్రామాలకు ప్రయోజనకరంగా వుంటుదన్నారు. నేతలు సుధాకరన్, ఇన్బనాథన్, సెంథిల్‌కుమార్,పుంగత్తూరు దేవ పాల్గొన్నారు.
చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో..
– రూ.27.50 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
– గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఎన్నికల సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బు, వస్తువులు, మాదకద్రవ్యాలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీని ఆధారంగా, శనివారం ముంబై నుండి చైన్నె సెంట్రల్ వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఓ ప్రయాణికుడిని విచారించగా, అతను తిరుత్తణికి చెందిన హరికృష్ణన్ (30) అని తెలిసింది అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో రూ.3 లక్షల 55 వేలు ఉన్నాయి. ఆ నగదుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపలేదు. ఇదే విధంగా, చైన్నె రాయపేట ప్రాంతానికి చెందిన జానకిరామన్ (50) అనే వ్యక్తి తన వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో సరైన పత్రాలు లేకుండా రూ.6 లక్షల 87 వేల 200, రూ.19 లక్షల 35 వేల విలువైన 129 గ్రాముల బంగారం, రూ.లక్ష 42 వేల 500 విలువైన 492 గ్రాముల వెండి ఉన్నాయి. దీంతో మొత్తం రూ.27 లక్షల 50 వేల డబ్బు, నగలు, వెండిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చంద్రకాసి ప్రాంతం నుండి తాంబరం వైపు వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలులో వచ్చిన బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 2 వ్యక్తులను పట్టుకుని తనిఖీ చేయగా, వారి వద్ద రూ.4 లక్షల విలువైన 8 కిలోల గంజాయి ఉన్నట్లు, వాటిని కేరళ రాష్ట్రం మలప్పురానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో వారిని అరెస్టు చేశారు.
వివాహేతర సంబంధానికి
అడ్డుగా ఉన్నాడని..
– భర్తను కిడ్నాప్ చేసి చంపేసిన భార్య
అన్నానగర్: కోయంబత్తూరు సమీపంలో తన స్నేహితులతో కలిసి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను కిడ్నాప్ చేసి, కత్తితో పొడిచి చంపినందుకు భార్య, వివాహేతర ప్రియుడి సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి సమీపంలోని పెరియ నేగామత్‌కు చెందిన సతీష్‌కుమార్ (40) కొబ్బరికాయలు కొట్టేవాడు. ఇతని భార్య శరణ్యను. వీరికి సుధిక్షన్ (9) అనే కుమారుడు, యక్షిత శ్రీ (6) అనే కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో అభిప్రాయ భేదాల కారణంగా ఈ జంట గత 5 సంవత్సరాలుగా విడిపోయారు. శరణ్య తన పిల్లలతో కుమారపాళయంలోని తన తల్లి ఇంట్లో నివసిస్తుంది. సతీష్‌కుమార్ తన పిల్లలను చూడటానికి అప్పుడప్పుడు కుమారపాళయంకు వచ్చేవాడు. ఈ స్థితిలో సతీష్‌కుమార్ 3వ తేదీన అదశ్యమయ్యాడు. శరణ్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి సతీష్‌కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ స్థితిలో అదృశ్యమైన సతీష్‌కుమార్ మృతదేహం తిరుప్పూర్ జిల్లాలోని పొంగ్కలూర్ ప్రాంతంలోని నాథేగౌండన్ పాలాయం బి.ఎ.పి. పామా కాలువలో తేలుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సతీష్‌కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. ఇందులో శరణ్యకు సెంట్రింగ్ కార్మికుడు మురుగన్ (45)తో గత 5 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని తేలింది. ఈ విషయం తెలుసుకున్న సతీష్‌కుమార్ భార్య శరణ్య, మురుగన్ ఇద్దరిని ఖండించాడు. ఈ స్థితిలో, 3వ తేదీన మురుగన్ తన స్నేహితులు గోపీనాథ్ (30), శివలింగం (24), 17 ఏళ్ల బాలుడితో కలిసి సెంజె రిమలైలోని టాస్మాక్ మద్యం దుకాణంలో మద్యం సేవిస్తున్నాడు. ఆ సమయంలో, సతీష్‌కుమార్ తన పిల్లలను కుమారపాలయంకు వచ్చాడు. ఈ సమాచారం గురించి శరణ్య తన వివాహేతర ప్రియుడికి సెల్ ఫోన్ ద్వారా తెలియజేసింది. సతీష్‌కుమార్ కుమారపాలైయం నుండి సెంజికి ప్రయాణిస్తుండగా, మురుగన్, గోపీనాథ్, శివలింగం, 17 ఏళ్ల బాలుడు అనే నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి తలపై బీరు డబ్బాతో కొట్టి చంపి కాలువలోకి విసిరారు. ఈ కేసులో, శరణ్య, మురుగన్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.


