కొరుక్కుపేట: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆర్పీఎఫ్ మోర్ మార్కెట్ కాంప్లెక్స్ బృందం తన నిఘాను ముమ్మరం చేసి, శనివారం పెరంబూరు రైల్వేస్టేషన్‌న్‌లో లెక్కల్లో లేని నగదు, బ్యాంకు చెక్కులను తీసుకెళ్తున్న ఒక ప్రయాణికుడిని అదుపుతోకి తీసుకున్నారు. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 2 వద్ద తనిఖీ చేస్తుండగా అధికారులు రాజస్థాన్‌న్‌కు చెందిన రూపారామ్ (39)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.9.20లక్షల నగదు, మూడు చెక్కులు (ఒక్కొక్కటి రూ.2లక్షలు)ఉన్నట్లు గుర్తించారు. హార్డ్‌వేర్ హోల్‌సేల్ వ్యాపారం కోసం డబ్బును సేకరించినట్లు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే, ఎన్నికల కోడ్ ప్రొటోకాల్‌ల ప్రకారం అవసరమైన చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్‌న్‌ను అతను సమర్పించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును చైన్నెలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌న్‌కమ్‌టాక్స్, యూనిట్–3(1)కి అప్పగించారు.


